జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్

       ఏపీలో ఎలక్షన్‌ హీట్‌ సెగలు కక్కుతోంది. అసంతృప్తుల జ్వాలతో రాష్ట్ర రాజకీయాలు మరింత కాకరే పుతున్నాయి. టికెట్‌ ఆశించి భంగపట్ట లీడర్లంతా ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో టికెట్ ఇవ్వకపోవడంతో పోతిన మహేష్‌ జనసేనకు రాజీనామా చేశారు. ఇంతకీ పోతినను పార్టీ ఎందుకు పట్టించుకోలేదు…? టికెట్‌ కోసం రోడ్డెక్కినా హైకమాండ్ ఎందుకు లైట్‌గా తీసుకుంది…? పోతిన నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి..?

     ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. జగన్‌ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న విపక్ష కూటమికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పొత్తు ధర్మంతో సీట్లు దక్కని నేతలంతా పార్టీలను వీడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ పశ్చిమ టికెట్‌ కోసం పట్టుపట్టినా లాభం లేకపోయేసరికి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు పోతిన మహేష్‌. ఇక ఇదివరకే కోనసీమ జిల్లా నుంచి పితాని బాలకృష్ణ, అమలాపురం నుంచి రాజాబాబు పార్టీనితోపాటు పలువురు పార్టీని వీడగా.. వారి బాటలోనే పోతిన మహేష్‌ జనసేనకు రాజీనామా చేశారు.

     పోతిన మహేష్‌ జనసేనలో మొదటి నుంచి ఉన్నారు. పవన్‌ను నమ్ముకుని ఐదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్‌ నుంచి టికెట్‌ ఖాయమని ఎంతో ఆశపడ్డారు. అయితే పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ టిక్కెట్‌ను బీజేపీకి కేటాయించారు. కమలం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎన్నికల బరిలో దిగారు. దీంతో టికెట్ రాదని కన్‌ఫర్మ్‌ చేసుకున్న పోతిన జనసేనకు గుడ్‌బై చెప్పారు. ఇక కొంత కాలంగా పోతిన టికెట్‌ కోసం పోరాడుతున్నారు. నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించాలని.. అది కూడా పోతినకే ఇవ్వాలని క్యాడర్‌ కూడా డిమాండ్ చేస్తూ నిరసన బాట పట్టింది. అయినప్పటికీ హైకమాండ్ దాన్ని లెక్క చేయకుండా పొత్తు ధర్మానికే తలొగ్గింది.

     జనసేనకు రాజీనామా చేసిన అనంతరం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు పోతిన మహేష్‌. కొత్త తరానికి బాటలు వేస్తారని, రాజకీయాల్లో మార్పు తీసుకువస్తారని పవన్‌ కల్యాణ్‌ను నమ్మి అడుగులు వేశామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్మకున్న వారిని నట్టేట ఎందుకు ముంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోతిన మహేష్‌ కొద్ది రోజులుగా తన అనుచర వర్గంతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక అటు వైసీపీ నేతలు పోతినతో టచ్‌లోకి వెళ్లినట్లు కూడా సమా చారం. మరి ఇలాంటి పరిణామాల మధ్య పోతిన మహేష్‌ నిర్ణయం ఏంటి..? ఆయన భవిష్యత్‌ కార్యాచ రణ ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Latest Articles

బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్