సద్గురు జగ్గీ వాసుదేవ్ ను పరామర్శించిన ప్రధాని మోదీ

ఆధ్యాత్మికవేత్త, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన మార్చి 14న న్యూఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు స్కానింగ్‌లు నిర్వహించిన వైద్యులు ఆయన తలలో రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. మార్చి 17న ఆయనకు సర్జరీ చేశారు. ఇప్పుడాయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.

ఆస్పత్రిలో కోలుకుంటున్న సద్గురు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో హాస్యాత్మక ధోరణిలో ఒక వీడియోను విడుదల చేశారు. తన తలలో ఏదో వెతికేందుకు వైద్యులు తన తలను కోశారని, ఖాళీగా ఉండడంతో వెంటనే కుట్లు వేశారని చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న సద్గురుకు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి పరామర్శించారు.

Latest Articles

మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్‌ లేదా బీజేపీలోకి?

మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్