16.7 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

 గులాబీ బాస్ వ్యూహాలు ఏమిటి ?

     ఒక్క ఎన్నిక.. ఒకే ఒక్క ఎన్నిక.. అంతా తారుమారు చేసింది. అవును.. అప్పటివరకు తిరుగులేని విధంగా అధికారం చెలాయించిన పార్టీ తలరాతని తెలంగాణ శాసనసభ ఎన్నికలు మార్చేశాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ లేకుండా రాష్ట్రంలో రాజకీయాలు ఊహించుకోవడమే కష్టం అన్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నాటికి గులాబీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న చర్చ సాగే వరకు వచ్చింది. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కఠినమైన సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొంటూ లోక్‌సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది ?

  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారి అత్యంత క్లిష్టమైన, కఠినమైన పరిస్థితులు ఎదుర్కొం టోంది బీఆర్ఎస్. ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన ఉద్యమ పార్టీగా 2014లో అధికారం లోకి వచ్చిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత 2018లోనూ తిరుగులేని విజయం సాధించింది. అయితే.. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండడం.. తద్వారా వచ్చిన ప్రజా వ్యతిరేకత కారణంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది కారు పార్టీ.

         ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కోలుకోకముందే… పార్లమెంటు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలోనే దెబ్బమీద దెబ్బ అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. తుంటి గాయంతో కొన్ని రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అధినేత కేసీఆర్. కొద్ది రోజుల క్రితమే తిరిగి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారాయన. ఈ నేపథ్యంలోనే అతి త్వరలోనే ఎన్నికల షెడ్యూలు రానుంది. దీంతో… రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ పరంగా ఏం చేయాలి.. ఎలా ముందుకెళ్లాలి అన్న తర్జనభర్జనలో గులాబీ పార్టీ అధినేత ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ఈ క్రమంలోనే రానున్న లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున బరిలో ఉండనున్న అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే నలుగురి అభ్యర్థిత్వాలకు పచ్చ జెండా ఊపారాయన. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్‌రావు, కరీంనగర్ నుంచి వినోద్, మానుకోటకు కవిత, పెద్దపల్లి బరిలో కొప్పుల ఈశ్వర్‌ దిగనున్నారు. త్వరలోనే మరిన్ని స్థానాలకు కేండిడేట్లను ప్రకటించనున్నారు గులాబీ బాస్.

    కేవలం అభ్యర్థుల ప్రకటనే కాదు.. కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని, పథకాల అమలు తీరుపైనా విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత. కేఆర్‌ఎంబీకి కృష్ణా నదీ ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంలో కొద్ది రోజుల క్రితమే నల్గొండలో భారీ సభ నిర్వహించింది బీఆర్ఎస్. ఈ సభ సాక్షిగా రేవంత్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్. అంతేకాదు.. అధికారంలోకి వచ్చేందుకు ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు వదిలేది లేదని హెచ్చరించారు. అటు.. గులాబీ పార్టీ నేతలది సైతం ఇదే మాట.

     విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి ఎలా ఉన్నా.. ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారం మాత్రం లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ను కలవరపెడుతోందనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ రెడ్డితో బహిరంగంగానే సమావేశమయ్యారు. పైకి పార్టీ మారడం లేదని.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెబుతున్నా… గత బీఆర్ఎస్ పాలనలో ఇదే మాదిరిగా జరగడంతో .. ఇప్పుడు తెరవెనుక ఏదో జరుగుతోందన్న విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. అయినా ఇదే విషయంపై.. పైకి బీఆర్ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తమ ఎంపీలను లాగేసుకుంటున్నారంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, అన్నింటి కంటే ముఖ్యమైనది.. ఉత్తర తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారడమే గులాబీ పార్టీ అధినాయక త్వానికి ఆందోళన కలిగిస్తోందన్న వాదన విన్పిస్తోంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దక్షిణ తెలంగాణతో పోలిస్తే.. ఉత్తర తెలంగాణలో కారు పార్టీ ప్రభావం చాలా ఎక్కువ. అలాంటిది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాంతానికి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల వైపు చూస్తుండడం బీఆర్ఎస్‌కు మైనస్సేనని చెప్పాలి. ఇప్పటికే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ పార్టీ మారగా.. ఇటీవలె జహీరాబాద్ ఎంపీ సైతం జంప్‌ చేశారు. ఇక, బీఎస్పీతో పొత్తును సైతం మరికొందరు నేతలు వ్యతిరేకిస్తూ పార్టీ మారే దిశగా ఆలోచిస్తు న్నారు. లోక్‌సభ ఎన్నికల నాటికి కచ్చితంగా పలువురు నేతలు గులాబీ గూటి నుంచి ఎగిరిపోయే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

      ఇవన్నీ ఒక ఎత్తైతే.. మేడిగడ్డ వ్యవహారం పార్టీకి స్పీడ్ బ్రేకర్‌లా మారిందన్న వాదన విన్పిస్తోంది. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారెజీ కుంగిపో యింది. దీంతో.. అప్పట్నుంచి కాంగ్రెస్, బీజేపీ రెండూ బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశాయి. అయితే.. ఏదో నాలుగు పిల్లర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం విషయంలో తప్పుడు ప్రచారం సరికాదంటూ గులాబీ నేతలు సర్థి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా.. బ్యారేజీ విషయం మాత్రం బీఆర్ఎస్‌కు బాగా నెగెటివ్‌గా మారిందన్న వాదన విన్పిస్తోంది. అందుకు తగినట్లుగానే విపక్షాలు సైతం ఇదే అంశాన్ని ప్రచారంలో హైలెట్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రధాని మోడీ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించి బీఆర్ఎస్‌ పాలనను విమర్శించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే అంశాన్ని తమ ప్రచారంలో హైలెట్ చేస్తూ ముందు కెళుతున్నారు. దీంతో.. ఏం చేయాలో బీఆర్ఎస్‌కు పాలుపోవడం లేదన్న వాదన విన్పి స్తోంది. ఇక, దోస్తీగా ఉంటుంద నుకున్న ఎంఐఎం సైతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తన స్టాండ్ మార్చుకుంది. దీంతో.. మైనారిటీ ఓట్లను సైతం కోల్పోయే పరిస్థితి గులాబీ పార్టీకి వచ్చిందన్న వాదన విన్పిస్తోంది. మొత్తంగా ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌ను ఎదుర్కొంటూ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటడం గులాబీ పార్టీకి గట్టి సవాలేనన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్