కొత్త సంవత్సరంలో వరుణ్ సందేశ్ కొత్త సినిమా షురూ 

యంగ్ హీరో వరుణ్ సందేశ్ కొత్త సంవత్సరంలో కొత్త సినిమాను ప్రారంభించారు. మహర్షి కూండ్ల సమర్పణలో M3 Media బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి మహేంద్రనాథ్ కూండ్ల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మొదటి చిత్రం “Production No.1 ” పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యింది. ఈ సినిమా ద్వారా శ్రీ అద్యాన్త్ హర్ష డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. పూజా కార్య్రక్రమాల అనంతరం హీరో వరుణ్ సందేశ్ క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ అజయ్ కుమార్ మొదటి షాట్ చిత్రీకరించారు.

చిత్ర హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘‘సరికొత్త కథాంశంతో తీస్తున్న సినిమా ఇది. కథ, కథనాలు చాలా ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అని ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని చెప్పారు.

డైరెక్టర్ అద్యాన్త్ హర్ష మాట్లాడుతూ.. ఇదొక విభిన్నమైన కథాంశంతో వస్తున్న థ్రిల్లర్ అని, హీరో లుక్, క్యారెక్టరైజేషన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.

చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ మేకింగ్ అండ్ టేకింగ్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నాం. కొన్ని సన్నివేశాలు, అందులో హీరో వరుణ్ సందేశ్ నటన ‘వావ్’ అనిపిస్తాయి. కథ, కథనంతో పాటు విజువల్స్‌గా కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినిచ్చే చిత్రంగా దీన్ని నిర్మించబోతున్నాం’’ అని చెప్పారు.

నటీనటులు:
వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోధిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణా దేవి, కుషాలిని పూలపా, ప్రసాద్ బెహరా తదితరులు.

సాంకేతిక బృందం:
ఈ చిత్రానికి మేకప్ చీఫ్: భాను ప్రియ అడ్డగిరి, కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్, స్టిల్స్: మోహన్, పబ్లిసిటీ డిజైనర్: గణపతి రత్నం, ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అర్జున్ కిన్నెర, పి.ఆర్.ఓ- పవన్ పాల్ ఎడిటర్: రామ్ తుము, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అజయ్ కుమార్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ – దర్శకత్వం: అద్యాన్త్ హర్ష.

Latest Articles

టెన్షన్‌లో విజయ్ ఫ్యాన్స్..?

కోలీవుడ్ లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతుంది. విజయ్, జూనియర్ విజయ్ ఒక నెల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్, జూనియర్ విజయ్.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా..?...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్