స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్‌కు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన సవాల్ విసిరారు. శుక్రవారం సూర్యాపేటలో బీజేపీ తలపెట్టిన జనగర్జన సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామని ప్రకటించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని.. ఈసారైనా దళిత వ్యక్తిని సీఎం చేస్తారా అని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పేదలు, బీసీల వ్యతిరేక పార్టీ అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్‌ది కుటుంబ పాలనని.. కేటీఆర్‌ను సీఎంను చేయడమే కేసీఆర్ లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమగ్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి అమిత్ షా సంచలన సవాల్
0
274
Previous article
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


