సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి అమిత్ షా సంచలన సవాల్

స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్‌కు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన సవాల్ విసిరారు. శుక్రవారం సూర్యాపేటలో బీజేపీ తలపెట్టిన జనగర్జన సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామని ప్రకటించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని.. ఈసారైనా దళిత వ్యక్తిని సీఎం చేస్తారా అని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పేదలు, బీసీల వ్యతిరేక పార్టీ అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్‌ది కుటుంబ పాలనని.. కేటీఆర్‌ను సీఎంను చేయడమే కేసీఆర్ లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమగ్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

Latest Articles

నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్