స్వతంత్ర వెబ్ డెస్క్: గ్రూప్-4 తుది ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుదల చేసింది . పేపర్-1 జనరల్ స్టడీస్‌లో ఏడు ప్రశ్నలు తొలగించగా.. మరో ఎనిమిదింటికి ఆప్షన్ మార్చినట్లు తెలిపింది. పేపర్-2 లో రెండు ప్రశ్నలు తొలగించగా.. అయిదింటికి సమాధానాలు మార్చారు. ఆగస్టు 28వ తేదీన ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి.. అభ్యంతరాలపై నిపుణుల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని మార్పులు, చేర్పులతో తుది ‘కీ’ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి జులై 1న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-4 పరీక్షకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9 లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2 వేల 878 పరీక్ష కేంద్రాల్లో 7 లక్షల 60వేల మంది పరీక్ష రాశారు. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడ్డారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.
TSPSC: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 తుది కీ విడుదల
0
355
Previous article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


