TSPSC: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 తుది కీ విడుదల

స్వతంత్ర వెబ్ డెస్క్: గ్రూప్‌-4 తుది ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ  తాజాగా విడుదల చేసింది . పేపర్-1 జనరల్​ స్టడీస్​లో ఏడు ప్రశ్నలు తొలగించగా.. మరో ఎనిమిదింటికి ఆప్షన్ మార్చినట్లు తెలిపింది. పేపర్-2 లో రెండు ప్రశ్నలు తొలగించగా.. అయిదింటికి సమాధానాలు మార్చారు. ఆగస్టు 28వ తేదీన ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి.. అభ్యంతరాలపై నిపుణుల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని మార్పులు, చేర్పులతో తుది ‘కీ’ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి జులై 1న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-4 పరీక్షకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9 లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2 వేల 878 పరీక్ష కేంద్రాల్లో 7 లక్షల 60వేల మంది పరీక్ష రాశారు. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడ్డారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్