స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతకుముందు అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారు. మీసం తిప్పుతూ చేతితో బాలకృష్ణ సైగలు చేశారు. బాలకృష్ణ మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. మీసాలు సినిమాలో తిప్పు.. ఇక్కడ కాదని అంబటి అన్నారు. దమ్ముంటే రా అంటూ అంబటి బాలకృష్ణకు సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టారు. ఇక, సభ్యుల ఆందోళన మధ్య ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది.
అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్
0
415
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


