హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఈ సారి మరో ప్రత్యేకతను కూడా చోటు చేసుకోనుంది. జెమినీ టీవీలో టెలీకాస్ట్ అయ్యే సీరియల్స్ నటీనటులు.. నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి.. గణేష్ పూజలో పాల్గొని, అక్కడ నిర్వాహకులను, భక్తులను స్వయంగా కలిసి వారితో ముచ్చటిస్తారు. ప్రేక్షక అభిమాన నటీనటులు మీ వీధి, మీ కాలనీ, మీ గల్లికీ రాబోతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం దిల్‍సుఖ్‍నగర్ వివేకానంద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్, సరూర్ నగర్ నవీజీవన్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపాలని ‘ఒంటరి గులాబి’ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సీరియల్ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న బాలు (రాహుల్ రవి), రోజా (సుప్రిత) సందర్శించి సందడి చేశారు. వినాయకుడికి పూజలు నిర్వహించారు.