Kishan Reddy Hunger Strike: దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ముగిసింది. బీజేపీ కార్యాలయంలో స్టేట్‌ చీఫ్‌ కిషన్‌రెడ్డి నిరాహార దీక్షను విరమించారు. కిషన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి ప్రకాశ్‌ జవదేకర్ దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద దీక్షకు సమయం మించి పోవడంతో పోలీసులు కిషన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు సిద్ధం కాగా.. పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాయి.

మరోవైపు.. కేసీఆర్‌ సర్కార్‌పై ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే చిత్తుకాగితం కాదు. 17పేపర్లు లీక్‌ చేసి.. తెలంగాణ విద్యార్థులకు విషాదం మిగిల్చారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేలను కూడా రానివ్వడం లేదు. కేసీఆర్‌ పాలన కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అని తీవ్ర విమర్శలు చేశారు.

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్