తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. టీటీడీ కీలక నిర్ణయాలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తామని టీటీడీ ఛైర్మన్(TTD) భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అలిపిరి(Alipiri) నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళే ద్విచక్ర వాహనదారులకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకే అనుమతిస్తామన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఎంత మందినైనా అటవీ శాఖ(Forest Department) సిబ్బందిని‌ నియమించేందుకు సిద్ధమన్నారు. భక్తులను గుంపులుగా నడక మార్గంలో పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నడక మార్గం, ఘాట్ రోడ్డులో జంతువులకు తినుబండారాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నడక మార్గంలో‌ ఉన్న హోటల్స్ ద్వారా వచ్చే వ్యర్ధాలు వేయకుండా నిరోధిస్తే చర్యలు తప్పవన్నారు.

దాదాపు ఐదు వందల ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని,  అవసరం అయితే డ్రోన్ కెమెరాలను(Drone Camera) ఉపయోగిస్తామని టీటీడీ ఛైర్మన్ అన్నారు. నడక దారిలో ఫోకస్ లైట్స్ ను ఏర్పాటు చేయాలని, ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ శాఖా అధికారుల నుంచి సలహా అడిగామన్నారు. కేంద్ర అటవీ శాఖ అధికారులకు ఫెన్సింగ్ ఏర్పాటుపై చర్చిస్తామని, అలిపిరి, ఏడోవ మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్