బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో మంచి మంచి పథకాలను అందుబాటులో ఉంచింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పంట సాయం ఏటా రూ. 6 వేలు అందిస్తోంది. అయితే రైతులకు మరో అద్భుత పథకం ఉంది. ఇందులో సాగుకు అవసరమైన ట్రాక్టర్‌ను(Tractor) సగం ధరకే దక్కించుకోవచ్చు. ఎలాగో పూర్తి వివరాలు చూద్దాం.
లక్షల రూపాయలు పెట్టి ట్రాక్టర్ కొనాలంటే.. భయపడుతుంటారు. వారికి కూడా కేంద్రం మద్దతు ఇస్తోంది. రైతులు సగం ధరకే ట్రాక్టర్‌ను సొంతం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అమలు చేస్తోంది. ఇదే ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన (Pradhan Mantri Tractor Yojana).  ఈ స్కీమ్‌లో భాగంగా రైతులు 50 శాతం తక్కువ ధరతో (సబ్సిడీతో) ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చు. ధర మొత్తంలో సగం చెల్లిస్తే చాలు ట్రాక్టర్ కొనే వీలు కల్పిస్తోంది కేంద్రం.

భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్న, సన్నకారు రైతు కూడా పీఎం ట్రాక్టర్ యోజన పథకానికి అర్హుడే. ఇక ఈ స్కీం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతు వయస్సు మాత్రం 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. సొంత పొలం లేకున్నా పర్లేదు.. కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందనేది గుర్తుంచుకోవాలి. కౌలు రైతులు.. యజమాని నుంచి NOC తీసుకోవాల్సి ఉంటుంది.

పీఎం ట్రాక్టర్ స్కీంకు దరఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించొద్దు. అప్లికేషన్ పెట్టుకున్న రైతు .. అర్హుడైతే అతనికి సగం రేటుకే ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రాక్టర్ ధరలో సగం కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సగం మొత్తాన్ని .. బ్యాంకులు రైతులు లోన్‌గా ఇస్తాయి.

ఫర్ ఎగ్జాంపుల్.. ఒక ట్రాక్టర్ ధర రూ. 8 లక్షలు అనుకుందాం. అందులో కేంద్రం రూ. 4 లక్షలు భరిస్తుంది. మరో రూ. 4 లక్షలు బ్యాంకు రైతుకు రుణంగా ఇస్తుంది. రైతు ట్రాక్టర్ కొన్న తర్వాత.. తాను లోన్‌గా తీసుకున్న రూ. 4 లక్షలను వాయిదా పద్ధతిలో (EMI) తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.

ఏమేం డాక్యుమెంట్లు కావాలి?
పీఎం ట్రాక్టర్ పథకానికి దరఖాస్తు చేసే రైతులు కచ్చితంగా ఈ పత్రాలు సమర్పించాలి. ఆధార్ కార్డు కచ్చితం ఉండాలి. పాన్ కార్డు/ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్/ పాస్‌పోర్టు (వీటిల్లో ఏదో ఒకటి), పొలానికి సంబంధించిన అడంగల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకునేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో వీలు కల్పిస్తున్నాయి. తెలంగాణలో అయితే .. కామన్ సర్వీస్ సెంటర్లలో (మీసేవా కేంద్రాలు) దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు అతడు ఉన్న గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులను సంప్రదిస్తే వివరాలు తెలుస్తాయి.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వెబ్‌సైట్లో https://pmkisan.gov.in/ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీని కోసం ముందుగా Login ID క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ తర్వాత.. అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఏమైనా అనుమానాలు తలెత్తితే.. రైతుల కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుంది. 155261 / 011-24300606 నంబర్స్‌కు ఫోన్ చేసి మీరు ప్రశ్నలు అడగొచ్చు.

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్