Minister Harish Rao: బీజేపీ బలం లేదు… కాంగ్రెస్‌కు కాండిడేట్లు లేరు.. బీఆర్‌ఎస్‌కు తిరుగులేదు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెక్‌కు (Congress) గతమే తప్పా భవిష్యత్తు లేదు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైంది.. అసెంబ్లీలోనూ కాంగ్రెస్ తీరు ఎంత దారుణంగా ఉందో చూశామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు(Minister Harish Rao) అన్నారు. శుక్రవారం గజ్వేల్(Gajwel)నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదు. కాంగ్రెస్‌లో వాల్ల గొడవలు వాళ్లకే తప్ప ప్రజల బాధలు పట్టవని మండిపడ్డారు.
బీజేపీ బలం లేదు. కాంగ్రెస్‌కు కాండిడేట్లు లేరు..బీఆర్‌ఎస్‌కు(BRS Party) తిరుగులేదన్నారు. ఎవరు ఔనన్నా, కాదన్నా బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్ కొట్టడం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అంటున్నారు. ఇది బీఆర్‌ఎస్‌ పాలనకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్