Telangana | నేడు రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం…

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నది. సాగు పనులు, భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులపైనా చర్చించనున్నది. ప్రత్యామ్నాయ సాగు విధానాలపైనా చర్చించే అవకాశం ఉన్నది. వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది.

యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికి చేపట్టే చర్యలపై చర్చించనున్నది. పాతబస్తీలో మెట్రో రైలు పనులను త్వరగా పూర్తి చేస్తామని ఐటీ మం త్రి కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెట్రో రైలు పొడిగింపుపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యా ల పెంపు తదితర అంశాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకోనున్నది. ప్రభు త్వ ఉద్యోగులు, ఉద్యోగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. గృహలక్ష్మి పథకం అమలుతోపాటు బీసీ, మైనారిటీబంధు అమలుపైనా చర్చ జరుగనున్నది. మరికొన్ని కొత్త నిర్ణయాలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభ లో ప్రవేశపెట్టే పలు బిల్లుల గురించి కూడా క్యాబినెట్‌ చర్చించనున్నది.

 

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్