ధీరూభాయ్ అంబానీ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం

స్వతంత్ర  వెబ్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, దివంగత శ్రీ ధీరూభాయ్ అంబానీ 21వ వర్ధంతిని పురస్కరించుకుని, డెక్కన్ బ్లడ్ సెంటర్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గురువారం జియో తెలంగాణ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. జియో తెలంగాణ సీఈఓ కె.సి.రెడ్డి దివంగత వ్యవస్థాపక చైర్మన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. సంస్థ ఉద్యోగులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధీరూభాయ్ అంబానీ ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తిగా నిలిచారని.. పెట్రోల్ పంపులో మొదలైన ప్రయాణం.. ఆ తరువాత వేల కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగా ధీరూభాయ్ అంబానీ ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తినిస్తుందని జియో తెలంగాణ సీఈఓ కె.సి.రెడ్డి తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఇలా రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రక్తం కొరత వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారందరికీ రక్తదాతలు ఇచ్చే రక్తం సంజీవని అని పేర్కొన్నారు. అత్యవసర స్థితిలో ఉన్న రోగికి రక్తం అవసరం ఉంటుందని, రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడి సకాలంలో రక్తం అందక చనిపోయినవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని కె.సి.రెడ్డి తెలిపారు.

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్