ఉపాసనకి బహుమతిని అందచేసిన ప్రజ్వల ఫౌండేషన్

స్వతంత్ర వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఈ జంట ఒకరు. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉపాసనకు ఓ ఊహించని బహుమతి అందింది. ఆ గిఫ్ట్​ను ఆమె సోషల్​మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన సోషల్​మీడియా ఇన్​స్టాలో తమ బిడ్డ కోసం చేయించిన ఊయల గురించి పలు విశేషాలను షేర్ చేశారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ సంస్థ ఓ ప్రత్యేకమైన ఊయలను కానుకగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఊయల ప్రాముఖ్యతను దాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు.సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకొని బయటపడిన మహిళలకు.. ప్రజ్వల ఫౌండేషన్‌ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోంది. వారిలోని కొందరు మహిళలే ఈ ఊయలను తయారు చేశారని ఉపాసన చెప్పారు. వారు తయారు చేసిన ఈ ఊయల.. ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. “అతి త్వరలో మేం ముగ్గురం కాబోతున్నాం. నా బిడ్డ కోసం మీరు చేతితో తయారు చేసి ఇచ్చిన ఈ ఊయల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని భావిస్తున్నాను. ఇది వారిలోని ధైర్యం, బలం, ఆత్మగౌరవం ఆశకు ప్రతీకగా నా బిడ్డకు గుర్తుండిపోతుంది. మా అందమైన ప్రయాణంలో అంతర్భాగమైనందుకు ప్రజ్వల ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు” అని ఉపాసన రాసుకొచ్చారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్