పాటకి స్వరం అందించిన ప్రధాని

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత ప్రతిపాదన మేరకు ఈ ఏడాదిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకొని తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం గ్రామీ అవార్డు విజేత, ప్రముఖ భారత-అమెరికన్‌ గాయని ఫాల్గుణి షా (ఫాలు) ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. అయితే ఫాల్గుణి కోరిక మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ పాటకి తన గాత్రాన్ని అందించారు. ‘Abundance in Millets’ పేరుతో ఫాలు, ఆమె భర్త గౌరవ్‌ షా ఈ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఇంగ్లిష్‌, హిందీలో ఉన్న ఈ పాటను ఫాలు దంపతులతో కలిసి ప్రధాని మోదీ రచించారు. గీతం మధ్యలో మోదీ స్వయంగా పలికిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యను ఎలా నిర్మూలించొచ్చన్నది ఈ పాట రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశారు. . దాదాపు 130కి పైగా దేశాల్లో చిరుధాన్యాలను పండిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ మంది వీటిని సంప్రదాయ ఆహారంగా పరిగణిస్తారు. ప్రధానితో కలిసి పాటను రచించడం చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లో ఈ పాటను రాశామని, త్వరలోనే దీన్ని ఇతర ప్రాంతీయ భాషాల్లోకి అనువాదం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

Latest Articles

12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్