స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి 216 హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి xuv500 కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు రాజమండ్రి నుండి ఏలూరు జిల్లా కొత్తూరు లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. అనంతపల్లి జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆగివున్న లారీని వెనుకనుండి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతులలో 8 నెలల బాబు వుండడం హృదయాల్ని కలిచివేస్తుంది.
బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మృతుల్లో 8 నెలల బాబు
0
414
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


