స్వతంత్ర, వెబ్ డెస్క్: కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని స్పష్టంచేశారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్ గెలుపును అందిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ విజయం కోసం అందరం సమిష్టిగా కష్టపడి గద్దె నుంచి కేసీఆర్‌ను దించుదామని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని మాత్రమే అని రేవంత్ ఎద్దేవా చేశారు. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అని విమర్శించారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో తేదీ ప్రకటించిన రేవంత్ రెడ్డి
0
291
Previous article
Next article
Latest Articles
బేగంపేట్ రైల్వేస్టేషన్‌లోకి వర్షం నీరు
హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి బేగంపేట్ రైల్వే స్టేషన్ లోపలకు వర్షం నీరు చేరింది. వర్షం నీళ్లు లోపలికి చేరడంతో ప్రయాణికులు, స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ...
- Advertisement -
- Advertisement -


