వాటిని 60 రోజుల్లోగా అమలు చేయాలి: సీఎం జగన్

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. గుంటూరులోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదన్నారు. పెన్షన్ సహా కొన్ని పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపనపడ్డామన్నారు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి.. అలాగే భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోని అమలు చేయాలన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే జీపీఎస్ ను తీసుకువచ్చామని తెలిపారు. రిటైర్డ్‌ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్ ను రూపొందించామని వివరించారు.

62 ఏళ్లకు రిటైర్‌అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి.. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచామని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడు సీపీఎస్ లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘకసరత్తు చేసింది.సుప్రీంకోర్టు తీర్పులనుకూడా పరిగణలోకి  కాంట్రాక్ట్‌ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా కూడా మంచి ఆలోచన చేశామని తెలిపారు.

Latest Articles

నిలోఫర్ బిల్డింగ్ ఫైర్ NOC సస్పెండ్

బంజారాహిల్స్‌లోని నిలోఫర్ బిల్డింగ్‌ను ఫైర్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పైభాగంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేల్చారు. తక్షణమే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్