స్వతంత్ర, వెబ్ డెస్క్: కన్న బిడ్డకు గుక్కెడు పాలివ్వలేని ఆర్థిక దైన్యమో లేక అక్రమ సంతానమో తెలియదు గానీ.. పేగు బంధాన్ని మరచికన్నపేగునే గాలికొదిలేసింది ఓ మాతృమూర్తి. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటు చేసుకుంది. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అప్పుడే పుట్టిన మగ శిశువును ఓ మహిళ సంచిలో కట్టి వదిలివెళ్లింది. సంచిని కార్యాలయం ఆవరణలో ఉన్న పందులు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాయి. ఈ చిక్రమంలో శిశువు ఏడుపు విన్న రెవెన్యూ కార్యాలయ ఉద్యోగులు.. శిశువును కాపాడి గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి ఆర్ఎంవో కె. రమణారెడ్డి తెలిపారు. కాగా, శిశువును ఎవరు వదిలేశారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మగ శిశువును సంచిలో కట్టి వదిలివెళ్లిన ఓ మహిళ
0
469
- Tags
- Giddalur
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


