స్వతంత్ర, వెబ్ డెస్క్: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన భేటీ ముగిసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బాలినేని.. కీలక విషయాలు వెల్లడించారు. అన్ని విషయాల మీద సీఎంతో చర్చించానని అన్నారు. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా సీఎంకి వివరించానని తెలిపారు. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదు. దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏం ఉంటుంది? అని వ్యాఖ్యానించారు. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవిపై కూడా చర్చ జరగలేదన్నారు. గతంలోనే ఆ పదవి వద్దని రాజీనామా చేశానన్నారు. సీఎం తనతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టమన్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. పార్టీ మార్పు అనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపడేశారు బాలినేని.
సీఎం జగన్ తో ముగిసిన బాలినేని సమావేశం
0
273
Previous article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


