స్వతంత్ర, వెబ్ డెస్క్: బీసీ డిక్లరేషన్ లో వివిధ రంగాల నిష్ణాతులతో రేపు బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ బాధ్యతను టీఎస్పీఎస్పీ మాజీ సభ్యులు సీహెచ్ విఠల్ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ కమిటీకి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అప్పగించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్, రిటైర్డ్ ఐపీఎస్ క్రిష్ణప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మహిళా మోర్చా జాతీయ నేత కరుణా గోపాల్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి బీసీ మేధావులు, విద్యావేత్తలతోపాటు పలువురు నిష్ణాతులను ఆహ్వానించారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే అంశాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీలుసహా అన్నివర్గాలను సామాజిక ఆర్థిక, రాజకీయ రంగంలో ప్రాధాన్యత కల్పించాలని లోతుగా అధ్యయనం చేసి నివేదిక తయారు చేయనున్నారు.
రేపు బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం
0
508
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


