24గంటల పాటు  ‘టైమ్‌ స్క్వేర్‌’లో ఎన్టీఆర్ చిత్ర‌మాలిక

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను అగ్రరాజ్యం అమెరికాలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నారై తెలుగుదేశం అమెరికా కో-ఆర్డినేటర్ జ‌య‌రాం కోమ‌టి నేతృత్వంలో ‘ఎన్టీఆర్’ చిత్ర‌మాలికను  ‘టైమ్‌ స్క్వేర్‌’లో ప్రకటన రూపంలో డిస్‌ప్లే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడ‌ల్పుతో ఉండే ఈ డిస్‌ప్లేను ఈ నెల 27 అర్ధ‌రాత్రి నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వ‌ర‌కు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్ర‌తి 4 నిమిషాల‌కు ఒక‌సారి 15 సెక‌న్ల చొప్పున ఎన్టీఆర్‌కు సంబంధించిన విభిన్న చిత్రాలను ప్రకటన ద్వారా ప్రసారం చేయనున్నట్లు వివరించారు. ప్రపంచంలోని ఎన్టీఆర్ అభిమానులంతా దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎన్నారై తెలుగుదేశం నాయకురాలు విద్య గారపాటి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ డిస్‌ప్లే ప్రకటన ద్వారా యుగ పురుషుడి ఖ్యాతి విదేశాల్లో మ‌రింత ప్రాచుర్యంలోకి రానుంద‌ని ఎన్నారై టీడీపీ నాయకులు చెప్పారు.

 

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్