స్వతంత్ర, వెబ్ డెస్క్: కారు ప్రమాదంపై స్పందించిన టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ స్పందించారు. ఈ ఉదయం నా కారు ప్రమాదానికి గురైందని.. ఇది చాలా చిన్న ఘటన అని పేర్కొన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో నేను ఇంట్లో పూర్తిగా సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఈ ఘటనపై ఎవరు చింతించాల్సిన పనిలేదన్నారు. నాపై మీరందరు ఇంత అభిమానాన్ని చూపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ లోని ఫిలిం నగర్ జంక్షన్ వద్ద శర్వానంద్ కు ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో ఆయనకు గాయాలు అయ్యాయి. వెంటనే ఈ ప్రమాదం చూసిన స్థానికులు శర్వానంద్‌ను ఆసుపత్రికి తరలించారు.