హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, జీడిమెట్ల, చింతల, అమీర్ పేట, పంజాగుట్ట, కూకట్ పల్లి, ఎల్బీనగర్, లక్డీకపూల్, మూసాపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపైకి నీళ్లు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నగరానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేయడంతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ లో భారీ వర్షం.. బల్దియా అధికారులు అప్రమత్తం
0
347
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


