కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. సూరత్ సెషన్స్ కోర్టు తనకు విధించిన శిక్షపై స్టేను తిరస్కరించిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. 2019 ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ కార్యాలయం రద్దు చేసింది. అలాగే రాహుల్ గాంధీ ఉంటున్న అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయించింది.
జైలు శిక్షపై గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్
0
1169
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


