స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 64,707 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,676 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్తానం అధికారులు తెలిపారు.