స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్ ఈరోజు పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో మొత్తంగా రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుస్నాబాద్ పట్టణంలో ఉదయం 10 గంటలకు రూ.33.51 కోట్లఅభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 11.35 గంటలకు డిపో గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం హనుమకొండకు బయల్దేరుతారు.
హనుమకొండలో రూ.181 కోట్లతో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. రూ.5.20 కోట్లతో ఇప్పటికే నిర్మితమైన మాడల్ వైకుంఠధామం, సైన్స్ పార్‌లను ప్రారంభిస్తారు. తెలంగాణ స్టేట్ సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూ.128 కోట్లతో 17 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆతర్వాత మధ్యాహ్నం 3 గంటలకు హసన్‌పర్తి కిట్స్ కాలేజీలో ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు హనుమకొండలో బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కాజిపేటలో ఏర్పాటు చేసి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.