30.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

గంగానదిలో డెడ్‌బాడీ ఉన్న సూట్‌కేస్‌ను పడేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇద్దరు మహిళలు

కోల్‌కతాలో కుమర్తులి సమీపంలోని గంగా ఘాట్‌ వద్ద ఉదయం యోగా చేసుకుంటున్న స్థానికులకు భయంకరమైన దృశ్యం కనిపించింది. దుర్గా పూజ కోసం విగ్రహాలను తయారుచేసే శిల్పులకు కుమార్తులి కేంద్రంగా ఉంది. ఎప్పుడూ ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

కానీ ఇవాళ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో, ఇద్దరు మహిళలు తెలుపు , నీలం రంగు క్యాబ్ నుండి ఊదా రంగు ట్రాలీ సూట్‌కేస్‌తో దిగడం అక్కడి స్థానికులు చూశారు. వాళ్ళు దాన్ని నది వైపు లాగడానికి ప్రయత్నించారు, కానీ వారిద్దరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. దీన్ని గమనించిన అక్కడి యోగా చేస్తున్న వారు.. అనుమానంతో మహిళల వద్దకు వచ్చారు. వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు.

ఆ సూట్‌కేసులో ఏముందని అడగ్గా.. అందులో కుక్క మృతదేహం ఉందని చెప్పారు. ఆ మహిళలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వారికి అర్ధమైంది. సూట్‌కేస్‌ను ఎవరూ తాకడానికి వీల్లేదని మహిళలు చెప్పారు. అనుమానం పెరగడంతో స్థానికులు పోలీసు అధికారికి ఫోన్ చేశారు.

సూట్‌కేసును తెరిచి చూసిన పోలీసులతో పాటు అక్కడి వారు ఒక్కసారిగా షాకయ్యారు. రక్తపుమరకలతో ఓ మహిళ డెడ్‌బాడీ కనిపించింది.

ఇక అక్కడ అందరూ ప్రశ్నించడంతో చివరకు వారిద్దరిలో ఓ మహిళ మాట్లాడుతూ.. తన వదిన ఆత్మహత్య చేసుకుందని.. ఆ మృతదేహం వదినదేనని చెప్పింది. అయితే నిజంగా ఆత్మహత్యకు పాల్పడితే డెడ్‌బాడీని ఎవరైనా ఇలా పడేస్తారా.. ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. పోలీసులకు ఫోన్‌ చేయాలి.. ఇప్పుడివే ప్రశ్నలు అక్కడున్న వారి మదిలో మెదిలాయి.

ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఫల్గుణి ఘోష్ , ఆమె తల్లి ఆరతి ఘోష్ గా గుర్తించామని చెప్పారు. మరణించిన మహిళ సుమితా ఘోష్… ఆమె అత్తగారు.

ఆ ఇద్దరు మహిళల పేరు మీద రైలు టికెట్స్ ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు. వారు కాజీపారా నుండి కుమార్తులికి రైలులో ప్రయాణించాలని మొదట భావించారు. కానీ కోల్‌కతా సమీపంలోని మధ్యగ్రామ్ నుండి పోలీసులు CCTV ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు, అందులో వారు సూట్‌కేస్‌ను ఓ బండిలో తీసుకొచ్చి సమీపంలోని టాక్సీ స్టాండ్‌కు తీసుకెళ్తున్నట్లు కనిపించింది. వారు నేరుగా కుమార్తులికి క్యాబ్‌లో వెళ్లారని పోలీసులు తెలిపారు.

ఆ మహిళలు మధ్యగ్రామ్ నివాసితులని పోలీసుల వర్గాలు తెలిపాయి. తల్లి , కుమార్తె రెండు సంవత్సరాలుగా అక్కడ అద్దెకు నివసిస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లీకూతుళ్లు ఎవరితోనూ మాట్లాడే వారు కాదని.. ఆ రాత్రి ఇంటికి మాత్రం ఎవరో వచ్చారని చెప్పారు. కొన్ని రోజుల కిందట ఓ మహిళ రాత్రివేళ ఇంటికి వచ్చినట్టు స్థానికులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేస్తున్నామన్నారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్