వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు సమాచారం. సోనియాను రాజ్యసభకు పంపాలని పార్టీ అగ్ర నాయకత్వం యోచిస్తునట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఏఐసీసీ.. సోనియాను రాజస్ధాన్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇటీవల సోనియా గాంధీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరారు.సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంటారని సమాచారం. రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉంటే ఉత్తరాదిలోని కీలక రాష్ట్రంలో విపక్ష కూటమికి అనుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రత్యక్ష రాజకీయాలకు సోనియా గాంధీ దూరం?
0
222
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


