గాంధీభవన్‌కు క్యూ కట్టిన కాంగ్రెస్‌ ఆశావాహులు

       గాంధీభవన్‌కు కాంగ్రెస్‌ ఆశావాహులు క్యూ కట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ టికెట్ల కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఉత్సా హం చూపిస్తున్న నేతలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు నిర్మాత బండ్ల గణేశ్‌ దరఖాస్తు చేశారు. అయితే, మల్కాజిగిరికి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ కూడా పోటీకి సిద్ధమవుతు న్నారు. మల్కాజ్‌గిరి స్థానం కోసం దిలీప్‌ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క సతీమణి నందిని ఖమ్మం పార్లమెంటు టికెట్‌ ఆశిస్తున్నారు. ఆమె తరఫున అనుచరులు గురువారం గాంధీ భవన్‌లో దరఖాస్తు అందజేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కూడా అదే స్థానానికి దరఖాస్తు చేశారు. భువనగిరి స్థానానికి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌, కె.నగేశ్‌ అప్లికేషన్‌ పెట్టుకున్నారు. 

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్