తియ్యని వేడుక చేసుకుందాం అనే ట్యాగ్ లైన్తో కస్టమర్లను ఆకట్టుకునే క్యాడ్బరీ కంపెనీ ఓ వ్యక్తికి చేదు అనుభ వం మిగిల్చింది. డెయిరీ మిల్క్ చాక్లెట్లో పురుగు కనిపించడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హైదరాబాద్ కు చెందిన రాబిన్ జాకెస్ అనే వ్యక్తి అమీర్ పేట మెట్రో స్టేషన్ లోని ఓ రిటైల్ షాపులో క్యాడ్ బరీ చాక్లెట్ తీసుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి కవర్ ఓపెన్ చేసి చూడగా.. చాక్లెట్ పై పురుగు కనిపించింది. అది కూడా బతికే ఉండడంతో రాబిన్ షాక్ తిన్నాడు. చాక్లెట్ పై పురుగు కదులుతుండడంతో.. మొబైల్ ఫోన్ తో వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు రాబిన్. ఎక్స్ పైరీ గడువు ముగిసిన చాక్లెట్ ను అమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డాడు. చిన్న పిల్లలు తినే చాక్లెట్ లో ఇలా పురుగు కనిపించడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
క్యాడ్బరీ చాక్లెట్లో కనిపించిన పురుగు
0
530
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


