ఎలన్ మస్క్‌కు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మద్దతు

టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్‌ కు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మద్దతు పలికారు. ప్రస్తుతం ఎలన్ మస్క్ పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మద్దతు పలకడం మస్క్‌ కు ఊరట లభించినట్లయింది. ఇటీవల ఎలన్ మస్క్ వివాదాల్లో చిక్కుకున్నారు. కొన్ని నెలల నుంచి ప్రపంచ నేతలతో ఎలన్ మస్క్‌ వివాదాలు పెట్టుకున్నారు. ఎలన్ మస్క్ తమ దేశ ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని ఫ్రాన్స్ అధినేత మేక్రాన్ ఇటీవల ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేయించడానికి మస్క్ కంకణం కట్టుకున్నారని మేక్రాన్ ఘాటు ఆరోపణలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అధికార మార్పిడి ఉద్యమానికి ఎలన్ మస్క్ మద్దతు పలుకుతున్నారని మేక్రాన్ ఆరోపించారు.

ఫ్రాన్స్ అధినేత మెక్రానే కాదు…బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ కూడా ఎలన్ మస్క్‌ పై నిప్పులు కురిపించారు. గతంలో కీర్ స్టార్మర్‌ బ్రిటన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నప్పుడు …గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాలను నిరోధించడంలో ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. కథ అక్కడితో ఆగలేదు. .గ్రూమింగ్ గ్యాంగుల గురించి తెలిసి కూడా…సదరు గ్యాంగుల దురాగతాల గురించి చూసీ చూడనట్లు వ్యవహరించారని ఎలన్ మస్క్ ఘాటు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంటును రద్దు చేసి, అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎలన్ మస్క్ డిమాండ్ చేశారు. అయితే ఎలన్ మస్క్ డిమాండ్‌ను బ్రిటన్ ప్రభుత్వం కొట్టి వేసింది. తప్పుడు సమాచారం ఆధారంగా మస్క్ మాట్లాడుతున్నారని బ్రిటన్ మంత్రి ఒకరు కామెంట్ చేశారు.

ఇదిలా ఉంటే ….ఎలన్ మస్క్‌ పై నార్వే ప్రధాని జోనాస్ కూడా మండిపడ్డారు. ఎలన్ మస్క్ అమెరికా రాజకీయాలకు పరిమితమైతే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. అమెరికా దాటి బయటి దేశాల రాజకీయాల్లో మస్క్ జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆర్థిక వనరులు దండిగా ఉన్న ఎలన్ మస్క్, ఇతర దేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడం సమంజసం కాదన్నారు జోనాస్.

ఇటువంటి పరిస్థితుల్లో ఎలన్ మస్క్‌ కు జార్జియా మెలోనీ మద్దతు పలికారు. ఎలన్ మస్క్ రైట్ వింగ్ కాకపోవడం వల్లనే ఆయా దేశాలన్నీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. ఎలన్ మస్క్ చెబుతున్నదానిలో తప్పేమీ లేదన్నారు ఆమె. తన భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలన్ మస్క్ ఉపయోగించుకుంటున్నారన్నారు. ఇందులో తప్పుపట్టాల్సిన అంశమేమీ లేదన్నారు మెలోనీ. వాస్తవానికి అమెరికాలోని బిలయనీర్ జార్జ్ సోరోస్ లాంటి లెఫ్ట్ వింగ్ మద్దతుదారులే ఇతర దేశాల రాజకీయ వ్యవహారాల్లో జోక్యానికి పాల్పడ్డారని మెలోనీ ప్రత్యారోపణ చేశారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు ఇటలీ ప్రధాని.

ఇదిలా ఉంటే, ఈనెల 20న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాధినేతలు ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. కాగా ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెలోనీ కూడా హాజరు కానున్నట్లు సమాచారం.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్