మరాఠా కమ్యునిటీకి పదిశాతం రిజర్వేషన్లు లభిస్తాయి. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును సమర్థించాయి. ఇది 50 శాతం దాటిన సామాజిక వర్గానికి రిజర్వేషన్లను వర్తింపజేయాలని బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లు ప్రకారం మరాఠాలకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10-12 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం వర్తింపజే స్తుంది. మరాఠా కోటా ప్రధాన ఎజెండాతో మహారాష్ట్ర రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను, ముసాయిదా బిల్లును నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శాసనసభ ఒక రోజు ప్రత్యేక సమావే శాల్లో ప్రవేశపెట్టారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ సునిల్ షుక్రే ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 2కోట్ల 25 లక్షల మంది ప్రజలను సర్వే చేసింది. రాష్ట్ర జనాభాలో 28 శాతంగా ఉన్న మరాఠా కమ్యునిటీ వెనుకబడినదిగా సర్వేలో తేలింది. పెద్ద సంఖ్యలో కులాలు, సమూహాలు ఇప్పటికే 52 శాతం కోటాతో రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి 28 శాతం ఉనికి ఉన్న ఇంత పెద్ద వర్గం మరాఠాలను ఒబిసి కేటగిరీలో ఉంచడం అసాధారణం గా కన్పిస్తోంది. మరాఠా రిజర్వేషన్ల వల్ల ఓబీసీలకు కానీ, ఇతర ఏ కమ్యునిటీ రిజర్వేషన్లకు కానీ నష్టం జరగబోదని మహారాష్ట్ర మంత్రి అనిల్ భాయ్ దాస్ పటేల్ తెలిపా రు.
మరాఠా కమ్యునిటీకి పదిశాతం రిజర్వేషన్లు
0
211
Previous article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


