పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. ఆమె విజయం ఆదర్శం

పశ్చిమ బెంగాల్‌లోని ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి కలితా మాఝీ విజయం సాధించారు. ఆమె తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి శ్యామా ప్రసన్న లోహర్‌పై గెలుపొందారు. రాజకీయాల్లోకి రాకముందు కలితా మాఝీ ఇళ్లలో సహాయకురాలిగా పనిచేసేవారు. సాధారణ జీవితంలో నుంచి వచ్చి ఎన్నికల్లో గెలవడం ద్వారా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.

గుస్కారా మున్సిపాలిటీకి చెందిన మాఝీ రాజకీయాల్లోకి రాకముందు పలు ఇళ్లల్లో సహాయకురాలిగా పనిచేశారు. 2021 ఎన్నికల్లో BJP ఆమెకు సీటు ఇవ్వడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన అభేదానంద థాండర్ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ స్థానికులతో ఆమెకున్న సంబంధాలపై విశ్వాసంతో BJP మరోసారి తాజా ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. ఈసారి ఆమె తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సాధారణ పౌరులు సైతం ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నిరూపించారు.

Latest Articles

చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్‌

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్