గాంధీభవన్‌కు కాంగ్రెస్ ఆశావాహులు క్యూ కట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఉత్సా హం చూపిస్తున్న నేతలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు నిర్మాత బండ్ల గణేశ్ దరఖాస్తు చేశారు. అయితే, మల్కాజిగిరికి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ కూడా పోటీకి సిద్ధమవుతు న్నారు. మల్కాజ్‌గిరి స్థానం కోసం దిలీప్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క సతీమణి నందిని ఖమ్మం పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు. ఆమె తరఫున అనుచరులు గురువారం గాంధీ భవన్‌లో దరఖాస్తు అందజేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కూడా అదే స్థానానికి దరఖాస్తు చేశారు. భువనగిరి స్థానానికి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్, కె.నగేశ్ అప్లికేషన్ పెట్టుకున్నారు.
గాంధీభవన్‌కు క్యూ కట్టిన కాంగ్రెస్ ఆశావాహులు
0
338
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


