రేపటి నుంచే మే నెల దర్శనం టికెట్లు విడుదల

      తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి మే నెల కోటా టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు… ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. లక్కీడిప్‌ టికెట్లు పొందిన భక్తులు మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్ల మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జారీ చేస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ విడుదల చేస్తారు. మే నెలకు సంబంధించి ఈ నెల 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటా, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్