రాముడిని నేను గౌరవిస్తాను-అసదుద్దీన్ ఓవైసీ

     అయోధ్య‌ రామమందిరంపై లోక్‌స‌భ‌లో స్వ‌ల్ప కాలిక చ‌ర్చ జ‌రిగింది. ఈ చ‌ర్చ‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. రామమందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతోందన్నారు. రాముడు ఒక మతానికే చెందిన దేవుడు కాదని.. ప్రజలు ఎలా జీవించాలో చేసి చూపించిన ఆదర్శ పురుషుడు రాముడని చెప్పారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా భ‌క్తి ఉద్య‌మాన్ని న‌డిపించార‌ని, కానీ ప్రాణ‌ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాన్ని రాజ‌కీయం చేయ‌లేద‌ని అమిత్ షా తెలిపారు. రాముడు లేని భారతదేశాన్ని ఊహించుకునే వారికి దేశం గురించి పూర్తిగా తెలియదన్నారు. మోదీ ఆధ్వర్యంలో 330 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించామని.. రామ మందిర నిర్మాణంలో అందరం ఐక్యమత్యంగా వ్యవహరించామని తెలిపారు. మరో వైపు అయోధ్య‌లో రామ్‌ల‌ల్లా ప్రాణ‌ప్ర‌తిష్ట‌పై జ‌రిగిన స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ పాల్గొన్నారు. బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌ను పార్ల‌మెంట్ ఖండించింద‌ని ఆయన గుర్తు చేశారు. తాను బాబర్, జిన్నా, ఔరంగజేబుకు ప్రతినిధిని కాదని..రాముడిని గౌరవిస్తానని చెప్పారు. ఈ దేశానికి మతం లేదని నమ్ముతున్నానని.. కానీ జనవరి 22 ద్వారా బీజేపీ ప్రభుత్వం ఒక మతంపై మరొక మతం గెలిచిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటోందా అని ఒవైసీ ప్రశ్నించారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్