తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ కు ఆహ్వానం.. మందుబాబులకు పండగే పండగ

తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ కు ఆహ్వానం.. మందుబాబులకు పండగే పండగ

మందుబాబులకు త్వరలో తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు టీజీబీసీఎల్ (తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్)రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ ను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆదేశించిన విధంగా కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు.

తెలంగాణలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తులను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి టీజీబీసీఎల్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో రిజిస్టర్ కానీ కొత్త కంపెనీలు… ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యత ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా, మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తులో జతపరచాలని టీజీ బీసీఎల్ కోరింది.

తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి టీజీబీసీఎల్ కొందరికి అనుమతులు ఇచ్చింది. కానీ కొత్త కంపెనీలపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల ఆహ్వానానికి కొత్త విధానానికి ప్రభుత్వం నాంది పలికింది. కొత్త దరఖాస్తులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం టీజీ బీసీఎల్ కు నిర్దేశించింది.

తెలంగాణలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి టీజీబీసీఎల్ ప్రకటన జారీ చేసింది. కొత్త కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను పది రోజులపాటు ఆన్ లైన్ లో పెట్టాలని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి అనుమతులపై టీజీబీసీఎల్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే టీజీబీసీఎల్ లో రిజిస్టర్ అయి సరఫరా చేస్తున్న సప్లయర్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్.. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం తీసుకోనుంది.

Latest Articles

మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్‌ లేదా బీజేపీలోకి?

మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్