పవన్ కళ్యాణ్ కి ఎంత కోపమో అంత సహనం కూడా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న చిన్న విషయాలకే ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతారని.. ఆయనకు ఓపిక, సహనం చాలా తక్కువని చాలా కాలం నుంచి వింటున్న మాటలే. ఈ మాటలను నిజం అన్నట్లుగా చాలా సందర్భాల్లో ఆయన ఘాటుగా స్పందించేవారు. ఇదే సమయంలో ఊగిపోయారు కూడా. కానీ పవన్ లో ఎవరికీ తెలియని సహనం దాగుందని .. అది కూడా ఓ రేంజ్ లో టన్నుల కొద్దీ ఉందని తాజాగా కొన్ని పరిణామాలను చూస్తే తెలుస్తోంది. మనిషిలోని కోపం వెంటనే బయటపడుతుంది కానీ.. సహనం అంత తొందరగా బయటకు తెలియదు కదా.

మొన్నటిదాకా సమావేశాలు, టూర్లు, ప్రభుత్వ పాలనలో బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్.. ఉన్నట్లుండి కనిపించకుండా పోయారు. అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇందుకు కారణం అనారోగ్యమేనని తర్వాత తెలిసింది. భరించలేని వెన్నునొప్పి కారణంగా ఆయన విశ్రాంతి తీసుకున్నారు. జ్వరం నుంచి కాస్త కోలుకోగానే వెంటనే ఎప్పటి నుంచో అనుకుంటున్న సనాతన ధర్మ పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టారు. శరీరం సహకరించకున్నా కూడా ఈ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు.

యాత్ర సందర్బంగా తన అనారోగ్యం, దీనివల్ల పడుతున్న ఇబ్బందుల గురించి స్వయంగా చెప్పారు కూడా. యాత్ర తర్వాత కూడా చికిత్స తీసుకుందామన్నా బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదు. తమన్ మ్యూజికల్ నైట్ కు హాజరయ్యాడు. మహాకుంభమేళాకు సతీసమేతంగా వెళ్లి పుణ్యస్నానం చేశారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. దాని వెంటనే అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో సమావేశాలకు హాజరుకావడం తప్పనిసరి. ఇక కాస్త టైమ్ దొరకడంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వెన్నునొప్పి ఉపశమనానికి కాస్త వైద్యం కూడా తీసుకున్నారు. మిగిలిపోయిన టెస్టులను వాయిదా వేసుకుని మళ్లీ అమరావతికి పయనమయ్యారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటే… అదే అస్వస్థత కారణంగా మెట్టు దిగడం, ఎక్కడానికి ఇబ్బంది పడితే… రాజకీయ ప్రత్యర్థులు, ట్రోలర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. టీడీపీతో జనసేనకు విభేదాలు వచ్చాయని… చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ తీయట్లేదని…త్వరలోనే కూటమి నుంచి జనసేన బయటకు వస్తుందని లెక్కలేనంత మేర దుష్ప్రచారం జరిగింది. ఇక వెన్నునొప్పితో ఆయన కుంభమేళాలో మెట్టు దిగేందుకు ఇబ్బంది పడితే… పవన్ శారీరకంగా ఇంత బలహీనంగా ఉంటారా? అంటూ కొందరు నెటిజన్లు పవన్ ను అవహేళన చేశారు. ఇన్ని జరుగుతున్నా… పవన్ ఒక్కటంటే ఒక్క మాట కూడా అనకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోయిన తీరు… నిజంగానే పవన్ లోని సహనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని చెప్పక తప్పదు.

Latest Articles

నిలోఫర్ బిల్డింగ్ ఫైర్ NOC సస్పెండ్

బంజారాహిల్స్‌లోని నిలోఫర్ బిల్డింగ్‌ను ఫైర్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పైభాగంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేల్చారు. తక్షణమే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్