స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలోని బీజేపీ జిల్లా నేతల టెలికాన్ఫరెన్స్ లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ వంటి ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా మోదీ, అమిత్ షా కలిశారు కదా? అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను, ప్రజలను కలవకుండా కేసీఆర్ మాదిరిగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ బీజేపీ కాదని మరోమారు స్పష్టం చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు ఊహగానాలే అన్న బండి.. ఊహాజనిత కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను ఉధ్రుతం చేయాలని బీజేపీ నేతలకు బండి పిలుపునిచ్చారు.
‘అమిత్ షా, జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి?’
0
952
Previous article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


