తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న కొరియోగ్రాఫర్స్‌లో యశ్వంత్ మాస్టర్ ఒకరు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సాధించారు యష్ అలియాస్ యాశ్వంత్ మాస్టర్. డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా మారాడు యశ్. తన స్లో మూమెంట్ స్టయిలిష్ స్టెప్పులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. సమంత లీడ్ రోల్ లో చేసిన యూటర్న్ లో ఒక పాట ద్వారా ఆయన బాగా పాపులర్ అయ్యాడు. దీంతో ఆ సినిమా తర్వాత యశ్ కి మరింత గుర్తింపు వచ్చి మరిన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. యశ్ మాస్టర్ కి సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక యశ్ అడ్డా పేరుతో యూట్యూబ్ లో ఛానల్ కూడా నడుపుతాడు యశ్. తన ఛానల్ లో తనకి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరగా ఉంటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కొత్త బ్యానర్ బాధ్యతలు తన కూతురు హర్షిత రెడ్డి కి అప్పగించారు. ఈ తరుణంలో బలగం తర్వాత ఈ బ్యానర్ నుండి మరో కొత్త సినిమాను యష్ హీరోగా అనౌన్స్ చేశారు. “ఆకాశం దాటి వస్తావా” టైటిల్ తో హీరోగా మారుతున్న యష్ మాస్టర్ ఇప్పుడు సంతోషం అవార్డ్స్ కోసం రంగంలోకి దిగారు. ఈ నవంబర్ 18న హైదరాబాద్ పార్క్ హయత్ లో జరగనున్న ఓటీటీ అవార్డుల వేడుక, గోవాలో జరుగుతున్న సంతోషం అవార్డుల వేడుకలో డ్యాన్స్ బాధ్యతలు అన్నీ ఆయన తీసుకున్నారు. ఈ రెండు వేడుకల మీద సెలబ్రిటీల డ్యాన్స్ లు అన్నీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఆయన రిహార్సల్స్ కూడా మొదలు పెట్టేశారు. అలా ఇప్పుడు సంతోషం ఈవెంట్స్ లో డ్యాన్స్ మరో లెవల్లో ఉండేలా చూసుకుంటానని అంటున్నారు యష్.