స్వతంత్ర వెబ్ డెస్క్: మరో రికార్డుకు చేరువలో కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 26 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా నిలవనున్నారు. ఇప్పటివరకు 510 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన కోహ్లీ…. 566 ఇన్నింగ్స్ లో 25,923 రన్స్ చేశారు. ఇందులో 77 సెంచరీలు, 134 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇవాళ బంగ్లాదేశ్ తో జరగనున్న డబ్ల్యూసి మ్యాచులో కోహ్లీ ఈ ఘనతను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అటు వరల్డ్ కప్ 2023 బెస్ట్ ఫీల్డర్ గా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఐసిసి ప్రకటించింది. అన్ని జట్లు మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ పోటీని నిర్వహించింది. కోహ్లీకి 22.30 రేటింగ్ పాయింట్ ఇచ్చి అగ్రస్థానంలో నిలిపింది. కోహ్లీ తర్వాత స్థానాల్లో జో రూట్(21.73), వార్నర్(21.32), కాన్వే(15.54), షాదాబ్ ఖాన్(15.13), మ్యాక్స్వెల్(15), రహమత్ షా(13.77), సాంట్నర్(13.28) ఉన్నారు.
WORLD CUP 2023 : మరో రికార్డుకు చేరువలో కింగ్ కోహ్లీ
0
411
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


