డబ్బు కోసం ఒడిశా రైలు ప్రమాద ఘటనను వాడుకున్న భార్య

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ఎంతోమంది అభాగ్యులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఆసరగా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికసాయం ప్రకటించాయి. అయితే ఈ డబ్బులు కోసం ఓ మహిళ అడ్డదారి తొక్కింది. కటక్ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా బహనాగ రైల్వే స్టేషన్ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఉన్న ఓ మృతదేహాన్ని అధికారులకు చూపించి తన భర్త బిజయ్ దత్తాదే అని చెప్పి విలపించింది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేపట్టిన పోలీసులకు ఆమె అబద్ధం చెబుతుందని అర్థమైంది. దీంతో పోలీసులు ఆమెకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.

అయితే ఈ విషయం ఆమె భర్త బిజయ్ దత్తాకు తెలియడంతో పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ప్రజాధనాన్ని దోచుకునేందుకు.. తాను బతికి ఉన్నా చనిపోయానని చెప్పినందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. దాంతో అరెస్టుకు భయపడి ఆ మహిళ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కాగా గత 13 ఏళ్లుగా గీతాంజలి, బిజయ్ విడివిడిగా జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి నకిలీ హక్కుదారులు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఒడిశా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పీకే జెనా ఆదేశించారు.

Latest Articles

నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన తేదీలు ఖరారు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈనెల 28న జరగనున్న బీజేపీ రాష్ట్ర వర్గ సమావేశానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్