ఓటీటీలో నాగచైతన్య ‘కస్టడీ’ ఎప్పుడంటే?

స్వతంత్ర, వెబ్ డెస్క్: అక్కినేని నాగచైతన్య కానిస్టేబుల్‌ పాత్రలో, ప్రముఖ నటుడు అరవింద్ స్వామి నేరస్తుడిగా నటించిన ‘కస్టడీ’ చిత్రం బుల్లితెరపైకి వచ్చేస్తోంది. కోలీవుడ్‌ దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రం మే 12న థియేటర్లలో విడుదలైంది. అయితే ఎన్నో అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జూన్‌ 9 నుంచి అభిమానులకు అందుబాటులో ఉండనుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని తెలిపింది. మరి థియేటర్లలో అంతగా విజయం సాధించని ఈ మూవీ ఓటీటీ వేదికలోనైనా ఆకట్టుకుంటుందో లేదో మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్