ఇచ్చిన మాట ప్రకారం ఆగష్టు 15న రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రకటించారు. కొడంగల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు వంద మాటలు చెబుతారని అవన్నీ నమ్మొద్దని అన్నారు. తప్పకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటిం చారు. బ్యాంకులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని, రుణమాఫీ చేసే బాధ్యత తనదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.గతంలో వరి వేశాక కొనుగోలు చేశాక రైతులను ఇబ్బంది పెట్టారని గుర్తుచేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేశామని అన్నారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.
రుణమాఫీ చేసిన మరుక్షణమే కేసీఆర్ బీఆర్ఎస్ను రద్దు చేస్తారా ? – రేవంత్రెడ్డి
0
207
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


