పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అయోధ్య అస్త్రం పని చేస్తుందా ?

   అయోధ్య అస్ర్తంగా శ్రీరాముని చుట్టూ పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్‌తో ఎన్నికల రణరంగం దద్దరిల్లుతోంది. ఎత్తుకుపై ఎత్తులు, వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఎలక్షన్‌ హీట్‌ అంతకుమించి అన్నట్టుగా సెగలు కక్కుతోంది.

   శ్రీరాముడి చుట్టూ తిరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. అయోధ్య నిర్మాణంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న కమలనాథులు అదే అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకున్నారు. దశాబ్ధాల నాటి కల మోదీ వల్లే నెరవే రిందని, దేశానికి సరైన నాయకుడు ఆయనేనని, ప్రధానిగా మరోసారి అవకాశమివ్వాలని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు కాసాయం నేతలు అయోధ్య మందిరాన్ని నిర్మించాలని కాంగ్రెస్‌ ఏనాడూ అనుకోలే దని, రామజన్మభూమి అంశాన్ని 70 ఏళ్లుగా అలాగే ఉంచిందని ఆరోపిస్తున్నారు.

     ఇక బీజేపీ వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. తాత ముత్తాల నుంచి హిందువులమేనని.. అయితే అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం హిందూయిజంలో ఉందన్నారు సీఎ రేవంత్‌ రెడ్డి. దేవుడు గుడిలో ఉంటాడు.. భక్తి గుండెల్లో ఉంటుంది కానీ మీలా రోడ్లపై ఊరేగదంటూ కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. కేవలం ఓట్ల కోసమే బీజేపీ మత రాజకీయం చేస్తూ మనుషుల మధ్య కలహాలను సృష్టిస్తోందని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏం చేశారో చెప్పుకోలేక రాముని పేరు చెప్పి, రాముడి ఫొటోతో ఓట్లు అడుక్కుంటున్నారని మండిపడ్డారు. మత రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శలు గుప్పిం చారు. అలాగే ముస్లింలకు ఆస్తులు పంచుతారన్న ప్రధాని వ్యాఖ్యలపై పొన్నం నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని మోదీకి వెన్నులో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. ఇక మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్‌. 10 ఏళ్ల పాలనలో మోదీ చేసిందేమి లేదు కాబట్టే.. జై శ్రీరామ్‌ అని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాముడు అందరివాడని బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదని ఆయన మండిపడ్డారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ది చెప్పాలని పిలుపుని చ్చారు కేటీఆర్‌. మొత్తానికి ఇలా పార్లమెంట్ ఎన్నికల చుట్టూ మతం మంటలు రేపుతున్నాయి. మరి మోదీ 10ఏళ్ల పాలనకు జనంజై కొడుతారా..? శ్రీరామ జపం మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందా.. లేదంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు బీజేపీకి ఓటమి తప్పదా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్