కమ్యునిస్టులకు అడ్డాగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు దూరంగా ఉంటున్నాయి. రాష్ట్రంలోనూ వామపక్షాలు, కాంగ్రెస్ ఆధ్వర్యం లోని ఇండియా కూటమికే జై కొడుతున్నాయి. గతంలో ఖమ్మం, భద్రాచలం ఎంపీలను సైతం గెలుచు కున్న చరిత్ర సీపీఎం, సీపీఐలకు ఉంది. ఉమ్మడి జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్ధుల గెలుపులో నూ ఆ పార్టీల మద్దతు కీలకంగా ఉంది. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ ఆవిర్భావంతో వారి ప్రభావానికి బీటలు వారాయి. ఖమ్మం, భద్రాచలం లోక్‌సభ స్ధానాల్లో ఈ రెండు పార్టీలది కీలక పాత్ర సాగింది. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒంటరిగా ప్రయాణించిన సీపీఎం, సీపీఐలే ఈసారి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌కు జై కొట్టబోతున్నాయి.
కూటమికి జై కొట్టిన ఖమ్మం కామ్రేడ్స్
0
227
Previous article
Next article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


